ప్రముఖ హీరో కార్తీ నటిస్తున్న విభిన్న చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకుడు. ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు. జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ఈ చిత్రం తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. గాయని ఇంద్రావతి చౌహాన్‌తో కలిసి హీరో కార్తీ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను హీరో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్లపై చిత్రీకరించడం జరిగింది. ఈ పాటలో హీరోహీరోయన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ‘జపాన్’ కార్తీ కెరీర్లోనే విభిన్నమైన సినిమా అని, ఇందులో కొత్త కార్తీని చూస్తారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సునీల్, విజయ్ మిల్టన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి వర్మన్.