Karthi | కార్తీ కాంట్రవర్షియల్ కామెంట్స్.. మాళవికా మోహనన్ గురించి మాట్లాడిన తీరుపై విమర్శలు!
Karthi | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘సర్దార్’ మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై మొదటి నుంచే ఆసక్తి పెరిగింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Karthi | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘సర్దార్’ మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై మొదటి నుంచే ఆసక్తి పెరిగింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ మాళవికా మోహనన్ గురించి కార్తీ మాట్లాడిన తీరు కొందరు నెటిజన్లకు అభ్యంతరకరంగా అనిపించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’లో మాళవికా మోహనన్ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిన సమయంలో చిత్రబృందంతో జరిగిన సరదా సంభాషణను గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్ నటి మోనికా బెల్లూచీ తరహాలో మాళవికకు కూడా సినిమాలో గ్లామరస్ దుస్తులు ఉంటాయా? అని తాను దర్శక నిర్మాతలను అడిగినట్లు కార్తీ చెప్పారు. అయితే తాను ఆ ప్రశ్నను తన వ్యక్తిగత ఆనందం కోసం అడగలేదని, ప్రేక్షకులకు తెరపై వినోదం అందించాలనే ఉద్దేశంతో సరదాగా అలా అడిగానని కార్తీ నవ్వుతూ చెప్పారు, కార్తీ వ్యాఖ్యలు ఆయన దృష్టిలో సరదాగా సాగినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
మాళవికా మోహనన్ ‘సర్దార్ 2’లో కేవలం గ్లామర్ పాత్రలో కనిపించడం లేదని, ఆమె ఓ స్పై పాత్రలో యాక్షన్‌తో కూడిన కీలకమైన క్యారెక్టర్ పోషిస్తున్నారని పలువురు గుర్తుచేస్తున్నారు. అలాంటి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ గురించి ఆమె దుస్తులు, గ్లామర్ కోణంలో మాట్లాడటం కంటే.. ఆమె యాక్షన్ పెర్ఫార్మెన్స్, పాత్ర గురించి మాట్లాడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు కార్తీ వ్యాఖ్యలను పూర్తిగా వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదని, ఆయన వాటిని సరదాగా చెప్పారని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే బహిరంగ వేదికలపై సహనటుల గురించి మాట్లాడేటప్పుడు మాటల విషయంలో మరింత జాగ్రత్త అవసరమనే చర్చ మాత్రం కొనసాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

