‘కార్తికేయ-2’ వందకోట్ల సంబురం
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ-2’చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా శుక్రవారం ఏపీలోని కర్నూల్లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ ‘రాజమౌళి, సుకుమార్ మన సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. వారు చూపించిన మార్గంలోనే మేము ఈ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1200 స్క్రీన్స్‌లో ‘కార్తికేయ-2’ ప్రదర్శింపబడటం తెలుగు సినిమా గొప్పతనంగా భావిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యుడిలా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. ఈ సినిమా ద్వారా నిఖిల్ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడని దర్శకుడు చందు మొండేటి తెలిపారు. తన కెరీర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఆనందం వ్యక్తం చేసింది. తమ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది తొలి వందకోట్ల చిత్రమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

