Jigarthanda DoubleX | లారెన్స్, ఎస్జే సూర్య జిగర్ తండ డబుల్ ఎక్స్‌ను తెలుగులో రిలీజ్ చేసేదెవరో తెలుసా..?
Jigarthanda DoubleX | తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj కాంపౌండ్ నుంచి జిగర్తండ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న మూవీ జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Jigarthanda DoubleX | తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. క్రేజ్ మామూలుగా ఉండదు. 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన జిగర్తండ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న మూవీ జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX). గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తాజాగా జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగు రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ప్రొడక్షన్స్ హౌజ్ సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు ఏసియన్ సినిమాస్ విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. అధికారికంగా ట్వీట్ చేశారు మేకర్స్. ఇప్పుడీ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు సినీ జనాలు. ఇప్పటికే లాంఛ్ చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ (Jigarthanda 2 teaser) కు అద్బుతమైన స్పందన వస్తోంది. రాఘవా లారెన్స్ సర్ప్రైజ్ మాస్ లుక్‌లో, ఎస్జే సూర్య సూట్లో క్లాసీ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు.
పక్కా మాస్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని టీజర్‌తో క్లారిటీ చెప్పేశాడు దర్శకుడు. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. సెట్స్‌లో ఎస్‌జేసూర్య, కార్తీక్ సుబ్బరాజు అండ్ టీం షూటింగ్ ప్యాకప్ చెప్తూ తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తెలుగు రిలీజ్ అప్డేట్..
#JigarthandaDoubleX will have a grand release in Andhra Pradesh and Telangana by @sureshprodns and @AsianCinemas_ 🔥
A @karthiksubbaraj film, in theatres this Diwali! @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh @kaarthekeyens @stonebenchers #AlankarPandian… pic.twitter.com/3LpQwRk5RL
— Ramesh Bala (@rameshlaus) October 25, 2023
సెట్స్‌లో ఎస్‌జేసూర్య, కార్తీక్ సుబ్బరాజు టీం..
It’s a WRAP for #JigarthandaDoubleX – see you in theatres this Diwali! #J2XShootWraps #DoubleXDiwali @offl_Lawrence @iam_SJSuryah @dop_tirru @Music_Santhosh@kaarthekeyens @stonebenchers @5starcreationss @alankar_pandian @onlynikil @thinkmusicindia pic.twitter.com/6LXUITIAJ1
— karthik subbaraj (@karthiksubbaraj) July 3, 2023
జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

