కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్‌ను (Jigarthanda 2 teaser) కు మంచి స్పందన వస్తోంది. కాగా తాజాగా షూటింగ్ అందించింది కార్తీక్ సుబ్బరాజు టీం. తాజా అప్డేట్ ప్రకారం జిగర్తాండ డబుల్ ఎక్స్ షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది.
ఈ విషయాన్ని కార్తీక్ సుబ్బరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.టీజర్లో లారెన్స్ సర్ప్రైజ్ మాస్ లుక్‌లో , ఎస్జే సూర్య సూట్లో క్లాసీ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. మాస్ ఎలిమెంట్స్ ను ఇష్టపడే మూవీ లవర్స్ కు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ జిగర్తాండ 2 అందిచండం ఖాయమని టీజర్‌తో అర్థమవుతుంది.
మేమంతా నేడు జిగర్తాండ 2 షూటింగ్ మొదలుపెట్టాం. ఈ ప్రత్యేకమైన సందర్భంగా మీ ఆశీస్సులు కావాలి.. అంటూ పోస్టర్ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
జిగర్తాండ 2 టీజర్…
కార్తీక్ సుబ్బరాజు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్..