కార్తీక్ రాజు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అధర్వ’. మహేష్ రెడ్డి దర్శకుడు. సుభాష్ నూతలపాటి నిర్మాత. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపీ: చరణ్ మాధవనేని