PS Mithran | కార్తీ తండ్రీ-కొడుకుగా కనిపిస్తాడు.. సర్దార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ చిట్ చాట్
పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో కార్తీ (Karthi) చేస్తున్న చిత్రం సర్దార్ (Sardar) సినిమాలో నటిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది. ఈ సందర్బంగా పీఎస్ మిత్రన్ మీడియా తో చిట్ చాట్ చేశాడు..సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ (Karthi) పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం సర్దార్ (Sardar) సినిమాలో నటిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది. ఈ సందర్బంగా పీఎస్ మిత్రన్ మీడియా తో చిట్ చాట్ చేశాడు..సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
సినిమా ఎలా మొదలైంది..?
నా తొలి సినిమా అభిమన్యుడు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నపుడు సర్దార్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని నా రైటర్లలో ఒకడితో చర్చించి..కథను డెవలప్ చేయమని చెప్పాను. బేసిక్ లైన్‌ను నిర్మాత లక్ష్మణ్‌కు వివరించా. ఈ కథను కార్తీకి చెప్పాలని ఆయన సలహా ఇచ్చారు. కార్తీకి ఈ కథ నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.
కార్తీ డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది..దాని గురించి..?
సర్దార్లో కార్తీ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. సర్దార్లో తండ్రీ-కొడుకుగా కనిపిస్తాడు కార్తీ. రెండు పాత్రలు విరుద్దంగా ఉంటాయి. స్పై క్యారెక్టర్ అజ్ఞాతంలో ఉండే పాత్ర కాగా..ప్రతీ చిన్న విషయానికి పబ్లిసిటీ కోరుకునే పాత్రగా పోలీసాఫీసర్ క్యారెక్టర్ సాగుతుంది.
కార్తీతో పనిచేయడం ఎలా అనిపించింది..?
నేను పనిచేసిన అందరూ యాక్టర్లలో కార్తీ చాలా ఉత్తమ నటుడు. తన పాత్రను చాలా శ్రద్ద పెట్టి చేస్తాడు. అంతేకాదు సినిమాకు ఉపయోగపడే చాలా విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆయన రీసెంట్ సినిమా పొన్నియన్ సెల్వన్-1 బ్లాక్ బస్టర్ హిట్. సర్దార్ సినిమాతో కూడా ఇదే సక్సెస్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నా.
దీపావళికి చాలా సినిమాలు విడుదలవుతున్నాయి..ఎలా ఫీలవుతున్నారు..?
శివకార్తికేయన్‌తో సినిమా చేసినపుడు..కార్తీ సినిమాతో పోటీ పడింది. ఇపుడు కార్తీతో సినిమా తీశా. సర్దార్ ఇపుడు శివకార్తికేయన్ సినిమాతో పోటీ పడుతుంది. ఇది కొంత వింతగా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు వేర్వేరు నేపథ్యంతో వస్తున్నాయి. దీపావళికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయం సాధిస్తాయని అనుకుంటున్నా.
సర్దార్‌ను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడంపై..
అన్నపూర్ణ స్టూడియోస్ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. వారు చూపించిన ప్రేమ అద్బుతం. ఊపిరి లాంటి సినిమాతో నాగార్జున, కార్తీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటం గొప్ప విషయం.
భవిష్యత్‌లో చేయబోయే సినిమాల గురించి..?
అఖిల్‌తో సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నా. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సర్దార్ సినిమా విడుదలపైనే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

