Sardar Movie | భారీ ధరకు కార్తి ‘సర్దార్’ థియేట్రికల్ రైట్స్?
Sradar Telugu Theatrical Rights | తమిళ స్టార్ కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలయ్యాయి. తెలుగులో ఈయన సినిమాలకు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘సర్దార్’ ఒకటి. ‘అభిమన్యుడు’ ఫేం పీఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.
ఈ సినిమా తెలుగు హక్కులను నాగార్జున సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను అన్నపూర్ణ స్టూడీయోస్ సంస్థ రూ.6 కోట్లకు విక్రయించిందట. తెలుగులో కార్తికి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ చిత్ర హక్కుల కోసం అంత మొత్తం ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కార్తి డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. చంకీపాండే, లైలా, రజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

