Japan Movie | ‘జపాన్’ లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన కార్తీ
Japan Movie | తమిళంకు సమానంగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్న నటుడు కార్తీ (Actor Karthi). ఆయన తన కెరీర్ బిగెనింగ్ నుంచే ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తీ సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి.
Japan | తమిళంకు సమానంగా తెలుగులో క్రేజ్ దక్కించుకున్న నటుడు కార్తీ. ఆయన తన కెరీర్ బిగెనింగ్ నుంచే ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తీ సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలలో గాని, స్పీచ్‌లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. గతేడాది (సర్దార్, పొన్నియిన్ సెల్వన్, విరుమన్) హ్యట్రిక్ హిట్స్ సాధించిన కార్తీ.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘జపాన్’ (Japan Movie) సినిమా చేస్తున్నాడు. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు.. కార్తీ కూడా తన రోల్‌కి డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా ‘జపాన్’ చిత్రం యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని.. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందని తెలిపారు. ఇక ఈ చిత్రంలో కార్తీకి జోడీగా అనూ ఎమ్మాన్యుయేల్ నటిస్తుంది.
The journey to perfection begins! #JAPAN dubbing kickstarts 🤩
FIRING THIS DIWALI 🧨@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman @ActionAnlarasu @philoedit #Banglan @YugabhaarathiYb… pic.twitter.com/eeNGZkbFWw
— DreamWarriorPictures (@DreamWarriorpic) September 13, 2023
ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

