ఏనుగు పిల్లకు.. పునీత్ రాజ్ కుమార్ పేరు

బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన మంచి పనులను తలుచుకోవడంతోపాటు ఆయన స్మృతి పది కాలలపాటు నిలిచి ఉండేలా కొందరు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక అటవీశాఖ అధికారులు ఈ దిశగా ముందడుగు వేశారు. శివమొగ్గ సమీపంలోని సక్రెబైలు ఏనుగు శిబిరంలోని రెండున్నర ఏండ్ల ఏనుగు పిల్లకు పునీత్ రాజ్‌కుమార్ అని పేరు పెట్టారు.
కాగా, ఈ గున్న ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టడం వెనుక కారణాన్ని శివమొగ్గ వన్యప్రాణి డివిజన్‌కు చెందిన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగరాజ్ వివరించారు. పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా సెప్టెంబర్‌లో ఈ శిబిరాన్ని సందర్శించారని, రెండు గంటలకు పైగా ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఏనుగు సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్లో భాగంగా ఈ గున్న ఏనుగుతో పునీత్ కొంత సమయం గడిపారని అన్నారు. ఈ నేపథ్యంలో శిబిరం సిబ్బంది, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు మగ ఏనుగు పిల్లకు దివంగత నటుడు పునీత్ పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
#WATCH | Karnataka: The Forest Department has named a two-year-old elephant calf at Sakrebailu elephant camp near Shivamogga after actor Puneeth Rajkumar, who passed away recently. pic.twitter.com/RtHdJ1hRVU
— ANI (@ANI) November 13, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

