Kareena Kapoor: ప్రెగ్నెన్సీ బైబిల్.. కరీనా కపూర్‌కు కోర్టు నోటీసులు
Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకం రాసిన నటిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుక్ టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని వాడడాన్ని తప్పుపడుతూ ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు.
భోపాల్: బాలీవుడ్ నటి కరీనా కపూర్(Kareena Kapoor)కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకం రాసిన నటి కరీనాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుక్ టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని వాడడాన్ని తప్పుపడుతూ ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ వేశారు. పుస్తకం టైటిల్లో బైబిల్ అన్న పదాన్ని ఎందుకు వాడారని కోర్టు ప్రశ్నలు వేసింది. పుస్తకంపై బ్యాన్ విధించాలని అడ్వకేట్ ఆంధోనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తకం అమ్మకందారులకు కూడా నోటీసులు జారీ చేశారు.
బుక్ టైటిల్లో బైబిల్ పదం వాడడం క్రైస్తవ సమాజ మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని జబల్‌పుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంథోనీ తన పిటీషన్లో ఆరోపించారు. క్రైస్తవులకు బైబిల్ చాలా పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. తన పుస్తకానికి పాపులారిటీ తీసుకువచ్చేందుకు నటి కరీనా ఆ పదాన్ని వాడినట్లు ఆంథోనీ ఆరోపించారు. 2021లో ఈ బుక్‌ను పబ్లిష్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

