Atlee looks | అట్లీ లుక్‌పై కామెంట్స్.. బాలీవుడ్ కామెడియన్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
Atlee looks - Kapil Sharma | తమిళ దర్శకుడు అట్లీపై బాలీవుడ్ స్టార్ కామెడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజా రాణి సినిమాతో హిట్ అందుకొని తేరి, మెర్సల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Atlee looks – Kapil Sharma | తమిళ దర్శకుడు అట్లీపై బాలీవుడ్ స్టార్ కామెడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజా రాణి సినిమాతో హిట్ అందుకొని తేరి, మెర్సల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో జవాన్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం బేబి జాన్ (Baby John). విజయ్ తేరి సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కథానాయకుడిగా నటిస్తుండగా.. కీర్తి సురేష్(Keerthy Suresh), వామిక గబ్బి(Wamika Gabbi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. కపిల్ శర్మ కామెడీ షోకి హాజరైన ఈ చిత్రబృందానికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ షోలో భాగంగా.. కపిల్ శర్మ అట్లీని అడుగుతూ.. ”మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ హీరో దగ్గరికైన వెళ్లినప్పుడు వాళ్లు అట్లీ ఎక్కడున్నారు అని అడిగారా” అంటూ కపిల్ ప్రశ్నించాడు. అయితే కపిల్ మాటల్లోని ఉద్దేశం అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలీలో గట్టిగా సమాధానమిచ్చాడు.
”ఇలాంటి ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఈ ప్రశ్నకు నా ఆన్సర్ ఒక్కటే. మనకు టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది పెద్ద విషయం కాదు. నేను ఈ విషయంలో ముందుగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కి ధన్యవాదాలు చెప్పాలి. నా దర్శకత్వంలో వచ్చిన రాజా రాణి సినిమాను నిర్మించింది ఆయనే. అతడు నన్ను నమ్మాడు కాబట్టే ఇలా ఉన్నాను. అయితే రాజా రాణి కథతో మురుగదాస్ దగ్గరికి వెళ్లినప్పుడు అతడు నా కథను మాత్రమే చూశాడు తప్ప నా లుక్ ఎలా ఉంది అనేది చూడలేదు. కాబట్టి.. ప్రపంచం కూడా మన పనినే చూడాలి తప్ప.. మన లుక్‌ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు”. అంటూ అట్లీ చెప్పుకోచ్చాడు. అయితే కపిల్ శర్మ అట్లీ లుక్స్‌పై కామెంట్ చేయడంతో అతడి తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Kapil Sharma subtly insults Atlee’s looks?
Atlee responds like a boss: Don’t judge by appearance, judge by the heart.#Atlee #KapilSharma pic.twitter.com/oSzU0pRDS4
— Surajit (@surajit_ghosh2) December 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

