కన్నడ చిత్రం ‘కాంతారా’ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం భాషా భేదాలకు అతీతంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. దాదాపు 400కోట్ల వసూళ్లను సాధించింది. రిషబ్శెట్టికి నటుడిగా, దర్శకుడిగా తిరుగులేని గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతారా చాప్టర్-1’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కొద్ది నెలల క్రితమే ప్రారంభమైనా..ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కాంతారా ప్రీక్వెల్ విశేషాలను వెల్లడించారు రిషబ్‌శెట్టి.
ఈ నెల 27న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నామని, ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దక్షిణాది నాలుగు భాషలు, హిందీతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘కాంతారా’ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీక్వెల్ ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. తొలిభాగం ముందు జరిగిన కథతో ‘కాంతారా చాప్టర్-1’ను తెరకెక్కిస్తున్నారు.