న్యూఢిల్లీ: కాంతారా ఫిల్మ్ హిందీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీ మార్కెట్లో ఆ ఫిల్మ్ ఇప్పటికే 80 కోట్లు వసూల్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 20వ తేదీన ఆ మైలురాయి దాటినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 14వ తేదీన రిలీజైన కాంతారా కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ షో కనబరుస్తోంది. నవంబర్ ఆరో తేదీన ఆ ఫిల్మ్ ఒక్క రోజే హిందీ మార్కెట్లో 4.5 కోట్లు వసూల్ చేసింది. ఆ సినిమా దాదాపు ప్రతిరోజు సగటున రెండు కోట్లు ఆర్జిస్తోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆయనే ఈ చిత్రంలో నటించారు.