Kantara Chapter 1 | లెజెండ్ వచ్చేసాడు.. ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కాంతార చాప్టర్ -1. ఈ సినిమా గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే.
Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. ఈ సినిమా గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటివలే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ను అందించింది. కాంతర ఛాప్టర్ 1 నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీనితో పాటు ఒక టీజర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం.
ಕಾಂತಾರದ ವಿಸ್ಮಯಗಳ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಮತ್ತೊಮ್ಮೆ ಸ್ವಾಗತ, ಮೊದಲ ಅಧ್ಯಾಯದ ಫಸ್ಟ್ ಲುಕ್ ಇಲ್ಲಿದೆ. ಈ ಹೊಸ ಪಯಣಕ್ಕೆ ನಿಮ್ಮ ಹಾರೈಕೆಗಳಿರಲಿ.https://t.co/QqpFVkmRTR@hombalefilms @KantaraFilm @VKiragandur @AJANEESHB pic.twitter.com/RHkQTevhWP
— Rishab Shetty (@shetty_rishab) November 27, 2023
రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్‌తో ఫస్ట్ లుక్ టీజర్ మొదలుకాగా.. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి కనిపిస్తాడు. ఇక ప్రీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు టాక్. ఈ సినిమా కోసం రిషబ్ గ్రౌండ్‌వర్క్ చాలానే చేసినట్లు తెలుస్తుంది.. ఇక తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

