Rishab Shetty | కాంతార ప్రీక్వెల్ సన్నాహాల్లో ఉన్నారు రిషబ్‌శెట్టి
‘కాంతార’ చిత్రానికిగాను ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికయ్యారు కన్నడ అగ్ర హీరో రిషబ్‌శెట్టి.
Rishab Shetty | ‘కాంతార’ చిత్రానికిగాను ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికయ్యారు కన్నడ అగ్ర హీరో రిషబ్‌శెట్టి. ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ సన్నాహాల్లో ఉన్నారు రిషబ్‌శెట్టి. ‘కాంతార’ మొదటిభాగం ముందు జరిగిన కథతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కనుంది.
భారీ హంగులతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు రిషబ్. యుద్ధ ఘట్టాలు, దక్షిణ కన్నడ ఆధ్యాత్మిక, దైవిక అంశాలతో ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు రిషబ్‌శెట్టి. ఈ నేపథ్యంలో రిషబ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు.
ఇందులో ఆయన కత్తి, డాలు పట్టుకొని కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. ‘కాంతార’ ప్రీక్వెల్ సన్నాహాల్లో భాగంగా ఆయన యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడని చిత్రబృందం వెల్లడించింది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

