Kannur Squad | ఓటీటీలోకి రాబోతున్న మమ్ముట్టి ‘కన్నూర్ స్క్వాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
Kannur Squad | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) జయపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక (Bazooka)తో పాటు భ్రమయుగం, యాత్ర 2, సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Kannur Squad Trailer | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) జయపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక (Bazooka)తో పాటు భ్రమయుగం, యాత్ర 2, సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. సినిమాటోగ్రాఫర్ రాబి వర్గీస్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు.. కిషోర్, విజయరాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, శరత్ సభ, సన్నీ వేన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ నిర్మిచింది.
ఈ సినిమా కథలోకి వెళితే.. కన్నూరు అనే ప్రాంతంలో జరిగిన మిస్టరీ డెత్స్, రాబరీ కేసులకు సంబంధించి దోషులను పట్టుకునే జార్జ్ మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మమ్ముట్టి కనిపించనున్నాడు. ఇక మమ్ముట్టితో కూడిన స్క్వాడ్ టీం ఈ కేసును ఎలా చేధించింది. ఈ క్రమంలో వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నరనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

