Kannappa Movie | కౌంట్ డౌన్ షురూ.. 40 రోజుల్లో ‘కన్నప్ప’.. కొత్త పోస్టర్ రిలీజ్
Kannappa Movie | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
Kannappa Movie Countdown | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇదివరకే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుంచి కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో శివుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. “జూన్ 27న ‘కన్నప్ప’ మీ ముందుకు వస్తోంది. ఇంకా కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి” అంటూ మంచు విష్ణు ఈ పోస్టర్‌ను తన ‘ఎక్స్’ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ తారాగణం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kannappa on June 27th. 40 days to go@akshaykumar #kannappa #harharmahadevॐ pic.twitter.com/AWKe2bHkzs
— Vishnu Manchu (@iVishnuManchu) May 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

