కన్నప్పలో శివరాజ్కుమార్మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో పలువురు అగ్ర తారలు భాగమవుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్ నటించబోతున్నారని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వెలువడింది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించబోతున్నారు.
‘ఆయనే సర్వం..ఆయనే విశ్వం..హర హర మహాదేవ’ అంటూ చిత్రబృందం సోషల్‌మీడియాలో ప్రకటించింది. 1988లో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం ‘భక్త కన్నప్ప’ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘కన్నప్ప’లో శివరాజ్‌కుమార్ నటించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతున్నది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.