కన్నడ నటుడు రిషి తెలుగులో అరంగేట్రం చేస్తూ నటిస్తున్న చిత్రం ‘వద్దురా సోదరా’. ఇస్లాహుద్దీన్ దర్శకుడు. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘వినూత్న ప్రేమకథా చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు దృశ్యరూపంలా ఉంటుంది. వినోదానికి పెద్దపీట వేశాం’ అని దర్శకుడు తెలిపారు. నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుప్రసాద్ పి, దిలీప్‌కుమార్, సంగీతం: ప్రసన్న శివరామన్, రచన-దర్శకత్వం: ఇస్లాహుద్దీన్.