Major Movie | ‘మేజర్’ కన్నా కన్నా వీడియో సాంగ్ రిలీజ్!
Kanna Kanna Video Song | అడివిశేష్ హీరోగా శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై సంచలన విజయం సాధించింది. మేజర్ సందీప్ పాత్రలో శేష్ జీవించాడు. శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. పోటీగా విక్రమ్ సినిమా ఉన్నా మేజర్ మంచి వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంతో శేష్ 60కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి టైర్2 హీరోలలో టాప్5లో చోటు దక్కించుకున్నాడు. ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాలకు సగం వరకు క్రెడిట్ దక్కుతుంది. ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరోకు పేరెంట్స్‌కు మధ్య ఉండే ఎమోషనల్ థీమ్‌ను దర్శకుడు ఈ పాటలో అద్భుతంగా చూపించాడు. శ్రీ చరణ్ పాకాల ట్యూన్ మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటకు కే.ఎస్ చిత్ర తన గాత్రంతో ప్రాణం పోసింది. బయోగ్రాఫీకల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

