Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse)తో పాటు పోస్టర్లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే.. డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో ఈ సినిమాను 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్లో సూర్య టైం లుప్లో కనిపిస్తున్నాడు. అయితే విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.
సూర్య కెరీర్లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంగువ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. కంగువ గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడు.
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்!
ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ!
ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! &
Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3— Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024