విధిని ఎదురించే వీరుడు
విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్..కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగు పేరు ఒక్కటే ‘కంగువ” అంటున్నారు తమిళ అగ్ర హీరో సూర్య.
“విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్..కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగు పేరు ఒక్కటే ‘కంగువ” అంటున్నారు తమిళ అగ్ర హీరో సూర్య. ఆయన నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కంగువ’ సెకండ్లుక్ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఆయన యుద్ధవీరుడిలా కనిపిస్తున్నారు. ఈ చారిత్రక నేపథ్య చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ వెర్షన్లో ప్రేక్షకుల ముందుకురానుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఎవరికీ తలొంచని ధీరుడిగా సూర్య పాత్ర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిస్వామి, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం: శివ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

