Kanguva Movie | ‘కంగువా’ నుంచి క్రేజీ అప్డేట్.. ఏకంగా 38 భాషల్లో విడుదల కానున్న తొలి పాన్ వరల్డ్ సినిమా!
Kanguva Movie | రజనీ, కమల్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో క్రేజ్ ఉన్న నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్య. తమిళంలో సూర్యకు ఎంత పాపులారిటీ ఉందో తెలుగులోనూ అంతే ఉంది. ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే ఇక్కడ కూడా భారీ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి.
Kanguva Movie glimps | రజనీ, కమల్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో క్రేజ్ ఉన్న నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్య. తమిళంలో సూర్యకు ఎంత పాపులారిటీ ఉందో తెలుగులోనూ అంతే ఉంది. ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే ఇక్కడ కూడా భారీ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. కాగా గత కొంత కాలంగా సూర్య సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి. గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ‘ఈటీ’ తొలిరోజే నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ ఫలితం మూటగట్టుకుంది. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇన్ని భాషల్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. అంతేకాకుండా అన్ని భాషల్లో 3డీ వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

