Kamal Hasan | టెలివిజన్ షోలలో ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న షో ‘బిగ్ బాస్’. ఈ షో వస్తుందంటే చాలు ప్రేక్షకుల టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పి రేటింగ్లలో కూడా ఈ షో దే పైచేయి. తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్వవహరించిన ఈ షోకు తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ నుండి కమల్‌హాసన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఈయన ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘కరోనా పరిస్థితులు విక్రమ్ సినిమాపై ప్రభావం చూపాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో నేను హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ షో, విక్రమ్ సినిమా డేట్స్ క్లాష్ అయ్యాయి. అందుకే బిగ్‌బాస్ హోస్ట్ నుంచి తప్పుకుంటున్నాను. యాజమాన్యంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను’ అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.