KH234 | గెట్ రెడీ.. కమల్‌హాసన్, మణిరత్నం టైటిల్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
KH234 | అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Hasan), దిగ్గజ దర్శకుడు మణిరత్నం(Maniratnam) కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ 1987(Nayakan) చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది. KH234 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా రీసెంట్గా లాంచ్ అయ్యింది.
KH234 | అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Hasan), దిగ్గజ దర్శకుడు మణిరత్నం(Maniratnam) కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ 1987(Nayakan) చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది. KH234 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా రీసెంట్గా లాంచ్ అయ్యింది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు.
రేపు లోక నాయకుడు కమల్‌హాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా.. నేడు సాయంత్రం 5 గంటలకు KH234 ప్రాజెక్ట్ నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాట్ సర్ప్రైజ్ వీడియో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
Embrace the EPIC REVEAL!
Title announcement video at 5pm today! Stay tuned for an unforgettable experience!#TitleAnnouncementToday5pm #KH234 #Ulaganayagan #KamalHaasan #HBDKamalSir #HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3… pic.twitter.com/HxAZGjGBoR— Turmeric Media (@turmericmediaTM) November 6, 2023
ఇక కమల్‌హాసన్ అండ్ మణిరత్నం టీంతో పలు సినీ పరిశ్రమల నుంచి 9 నేషనల్ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు జాయిన్ అయ్యాడని తెలిసిందే. ఇటీవలే శ్రీకర్ ప్రసాద్, కమల్ హాసన్, మణిరత్నం కలిసి దిగిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

