దర్శకుడు శంకర్ పేరు వినగానే ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు గుర్తుకొస్తాయి. సామాజిక అంశాలను ఎంచుకొని వాణిజ్య పంథాలోనే భారీ హంగులతో సినిమాల్ని నిర్మించడం ఆయన శైలి. అయితే దర్శకుడిగా కొన్నేళ్లుగా ఆయన వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకత్వానికి తాత్కాలికంగా బ్రేక్‌నిచ్చి నటనపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారట. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా కమల్‌హాసన్ నిర్మాణంలో శిబి చక్రవర్తి దర్శకత్వం వహించే చిత్రంలో శంకర్ విలన్ పాత్రను పోషించనున్నారని చెన్నై ఫిల్మ్‌నగర్ టాక్. ఇందులో ఆయన ైస్టెలిష్ విలన్‌గా కనిపించనున్నారని సమాచారం.
రజనీకాంత్, కమల్‌హాసన్‌తో శంకర్‌కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో మరలా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శంకర్ సిద్ధమయ్యారని అంటున్నారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రోజుల్లో శంకర్ కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. తాను డైరెక్ట్ చేసిన శివాజీ, రోబో, నన్బన్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటనపై దృష్టి పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.