మాలాంటి మిత్రులు ఈ తరంలో లేరు
నిజమైన స్నేహం చిరకాలం నిలిచే ఉంటుంది. రజనీకాంత్, కమల్హాసన్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాల్లో నటించారు.
నిజమైన స్నేహం చిరకాలం నిలిచే ఉంటుంది. రజనీకాంత్, కమల్హాసన్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోలుగా ఎదిగారు. స్టార్లయ్యారు. సూపర్‌స్టార్లయ్యారు. కెరీర్ పరంగా నువ్వానేనా అనే పోటీ మొదట్నుంచీ ఉన్నా.. ఎప్పుడూ ఇద్దరిమధ్య విభేదాలు రాలేదు. అదీ స్నేహమంటే. రీసెంట్గా సైమా అవార్డుల వేడుకలో ‘విక్రమ్’ సినిమాకు గాను ఉత్తమనటుడిగా అవార్డును అందుకున్న కమల్, తన మిత్రుడు రజనీకాంత్ గురించి వేదికపై మాట్లాడారు.
‘మాలాంటి స్నేహితులు ఈ తరంలో లేరు. మాకు ఇగోలు ఉండవు. ఎవరికి సక్సెస్ వచ్చినా ఇద్దరం ఆనందిస్తాం. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ నా వీరాభిమాని. అతను రజనీని డైరెక్ట్ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. ‘మీ అభిమాని రజనీతో సినిమా చేయటమేంటి?’ అని కొందరు నాతో అన్నారు. సాధారణ ప్రేక్షకులకు రజనీ, కమల్ అంటే పోటీ హీరోలు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. రజనీ, కమల్ ప్రాణస్నేహితులు. పదిహేనేళ్ల క్రితం ‘కమల్ 50’ అనే కార్యక్రమంలో నా మిత్రుడు రజనీ గురించి మాట్లాడాను. ఇప్పుడు మళ్లీ మాట్లాడాలనిపిస్తుంది. మా మధ్య విపరీతమైన పోటీ ఉండేది. కానీ అది ఆరోగ్యకరంగానే ఉండేది. ఓ విధంగా మేం ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆ పోటీనే’ అని చెప్పుకొచ్చారు కమల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

