Indian-2 Movie | ఇండియన్-2 షూటింగ్లో ట్విస్ట్.. షూట్‌ను మధ్యలో ఆపేసిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
Indian-2 Movie Shooting stopped | ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది.
Indian-2 Movie Shooting stopped | ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జరుపుగుంది. కాగా విమానాశ్రయంలో ఓ భారీ సీన్ చిత్రీకరిస్తుండగా ఏయిర్పోర్ట్ నిర్వాహాకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట. ఇక చిత్రబృందం ఏయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు, డిపార్చర్ ఏరియాలో షూటింగ్ చేసుకోవడానికి మాత్రమే పర్మీషన్ పొందింది. కానీ లావటరీ ఏరియాలో షూటింగ్‌కు పర్మీషన్ లభించలేదు. అయినా గానీ అక్కడ షూటింగ్ చేయడంతో ఏయిర్పోర్ట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. కాగా డిపార్చర్ ఏరియాలో పర్మీషన్ కోసం చిత్రబృందం ఏకంగా కోటీ ఇరవైనాలుగు లక్షలు చెల్లించిందట.
సంక్రాంతిని టార్గెట్ చేస్తూ శరవేగంగా టాకీ పార్టు పూర్తయ్యే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు కంపోజ్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

