గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్' (1987) క్లాసిక్‌గా నిలిచిపోయింది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్’ (1987) క్లాసిక్‌గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. నేడు కమల్‌హాసన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించనున్నారు. అనౌన్స్మెంట్ వీడియోలో శత్రువులతో పోరు చేస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించారు కమల్. దుల్కర్ సల్మాన్, త్రిష, జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్, రచన-దర్శకత్వం: మణిరత్నం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

