Kamal Haasan | న్యూఇయర్‌లో కమల్‌హాసన్ కొత్తకొత్తగా.. స్టైలిష్‌గా..
గతేడాది విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కమల్ హాసన్. ఈ స్టార్ యాక్టర్ న్యూ ఇయర్‌ను చాలా స్పెషల్ గా జరుపుకున్నాడు. న్యూఇయర్‌లో కొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ హమ్ చేస్తున్న ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏం చేశాడనే కదా మీ డౌటు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్ (Kamal Haasan). ప్రయోగాత్మక సినిమాలు , విలక్షణమైన కథాంశాలతో సినిమా చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ సీనియర్ హీరో. గతేడాది విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కమల్ హాసన్. ఈ స్టార్ యాక్టర్ న్యూ ఇయర్‌ను చాలా స్పెషల్ గా జరుపుకున్నాడు.
కమల్ ఇంతకీ ఏం చేశాడనే కదా మీ డౌటు. రీసెంట్గా చిన్న పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నూతన సంవత్సర (New Year wishes) శుభాకాంక్షలు తెలియజేశాడు కమల్ హాసన్. ఆరు పదుల వయస్సు దాటిపోయినా తానింకా కుర్రహీరోలకు ఏ మాత్రం తీసిపోనని, ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ చెప్పకనే చెబుతున్నాడు కమల్ హాసన్. కమల్ హాసన్ న్యూఇయర్‌లో కొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ హమ్ చేస్తున్న ఈ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
నెక్ట్స్ మణిరత్నం డైరెక్షన్లో 234వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కమల్ హాసన్. ఇటీవలే ప్రకటించిన ఈ చిత్రానికి కమల్ హాసన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. త్రిష ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఇండియన్ 2 సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
#KamalHaasan pic.twitter.com/AobHwYyRH7
— Thyview (@Thyview) January 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

