KH234 | ఇండియన్ 2తో బిజీగా లోకనాయకుడు కమల్ హాసన్ (kamal haasan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. హెచ్ వినోథ్ డైరెక్షన్లో KH233 షురూ అంటూ ఇటీవలే ఓ వీడియో రూపంలో అప్డేట్ అందించింది కమల్ హాసన్ టీం. మరోవైపు మణిరత్నం డైరెక్షన్లో KH234 ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ఓ అప్డేట్ కూడా వచ్చింది. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానుల్లో జోష్ నింపే మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం కమల్ హాసన్ లుక్ టెస్ట్ పూర్తయిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ వీడియో కూడా రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. KH234 సినిమా కోసం కమల్ హాసన్ లుక్ టెస్ట్ పూర్తయిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ వీడియో కూడా రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రానికి రవి చంద్రన్ సినిమాట్రోఫర్గా పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
KH234 మూవీ షూటింగ్ 2024లో షురూ కానుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. KH234 చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మి్స్తున్నాయి. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
మరోవైపు KH233 చిత్రాన్ని కమల్ హాసన్ సమర్పణలో హోంబ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్పై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సామాజిక కథాంశాన్ని జోడిస్తూ.. KH233 ఉండబోతున్నట్టు టాక్. కమల్ హాసన్ మరోవైపు ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023
గన్స్ లోడింగ్..
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
KH233 షురూ..
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023
డైరెక్టర్ హెచ్ వినోథ్‌కు కమల్ బర్త్ డే విషెస్..
Wishing our director, #HVinoth, a happy birthday! #Ulaganayagan #KamalHaasan #KH233 #RKFI52 #RISEtoRULE https://t.co/vvsqEBrM2M
— Raaj Kamal Films International (@RKFI) September 5, 2023