‘విక్రమ్’ సూపర్ హిట్‌తో మరోసారి ఫామ్‌లోకి వచ్చారు కమల్ హాసన్. చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. తన ఇన్నేళ్ల కెరీర్ ఒకెత్తు, ఈ సినిమా ఒక్కటి ఒకెత్తు అనేంత పేరు తీసుకొచ్చింది విక్రమ్. ఆర్థికంగా కమల్ హాసన్ స్థిరపడేలా చేసింది. ఈ సినిమా తీసుకొచ్చిన ఆదాయంతో ‘అప్పులు తీర్చేస్తా, నచ్చిన ఫుడ్ తింటా, స్నేహితులకు కొంత హెల్ప్ చేస్తా’ అని చెప్పుకున్నారు కమల్ హాసన్. ఈ సినిమా విజయంతో తన పారితోషికం కూడా బాగా పెంచేశారట కమల్. తన కొత్త సినిమా ‘ఇండియన్ 2’ కోసం దాదాపు 150 కోట్ల రూపాయలు (అన్ని ఒప్పందాలు కలుపుకొని) తీసుకుంటున్నారీ హీరో. తమిళ చిత్ర పరిశ్రమలో ఒక హీరోకు చెల్లిస్తున్న అధిక మొత్తం ఇదేనని ఇండస్ట్రీ వాసులు చెబుతున్నారు. విక్రమ్ సక్సెస్‌ను కమల్ ఇలా ఎన్‌క్యాష్ చేసుకున్నారని వారంటున్నారు. కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధికంగా రజినీకాంత్ 110 నుంచి 120 కోట్ల రూపాయలు, విజయ్ దాదాపు 130 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ‘ఇండియన్ 2’ చిత్రం ద్వారా వారందరినీ దాటేశారు కమల్.