Vikram Movie | విడుదలకు ముందే లాభాల్లో కమల్ హాసన్.. భారీ ధరకు ‘విక్రమ్’ నాన్-థియేట్రికల్ హక్కులు?
Vikram Movie Non-Theatrical rights | లోకనాయకుడు కమల్‌హాసన్ ఆరు పదుల వయసు దాటినా యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. మాస్టర్ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన మేకింగ్ గ్లింప్స్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతకొంత కాలంగా కమల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో ‘విక్రమ్’ చిత్రం మళ్ళీ అప్పటి కమల్‌ను గుర్తుచేస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది.
మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలను నెలకొన్నాయి. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించనుడంటంతో ప్రేక్షకులలోనే కాదు సినీప్రముఖులలో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ముగ్గురు స్టార్ హీరోలను లోకేష్ స్క్రీన్ పైన ఎలా చూపిస్తాడో అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ.125కోట్లకు అమ్ముడయ్యాయి. స్టార్ గ్రూప్ సంస్థ ఈ చిత్ర శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోగా, డిజిటల్ హక్కులను డీస్నీ+హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇంకా ఆడియో రైట్స్, ఇతర రైట్స్ కలపకుండానే ఈ మేర బిజినెస్ చేసిందంటే విశేషం అనే చెప్పుకోవాలి.
ఈ చిత్రానికి దాదాపుగా 112కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే విక్రమ్ సినిమా విడుదలకు ముందే 12కోట్ల లాభాలను అందుకుంది. ఈ చిత్రం కమల్ హసన్‌కు 232 సినిమాగా తెరకెక్కింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ మే 15న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

