Kamakshi Bhaskarla | విరూపాక్ష, పొలిమేర, పొలిమేర 2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కామాక్షి భాస్కర్ల. విభిన్నమైన క్యారెక్టర్లు చేసి మెప్పించింది. ‘సైతాన్’ వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి షాక్ ఇచ్చింది. ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్‌తో చిట్‌చాట్‌లో హాట్ కామెంట్స్ చేసింది కామాక్షి. ‘బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ. అమాయక పాత్ర అయినా, బోల్డ్ క్యారెక్టర్ అయినా నటికి ఒకటే! కథానుగుణంగా పాత్ర ఉంటుంది.
ఆ రోల్‌ను పండించడం నటిగా నా విధి. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే.. దుస్తులు లేకుండా నటించడానికి కూడా నేను సిద్ధం. ఈ రోజు ఉండి రేపు ఫేడ్ అయిపోయే ఇమేజ్, అందం గురించి పెద్దగా పట్టించుకోను. నేను మంచి డ్యాన్సర్‌ని. పాట నచ్చి, మంచి యాక్టర్ పక్కన అయితే స్పెషల్ సాంగ్ చేయడానికీ రెడీ. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని దర్శకులు ఆఫర్లు ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చిందీ చిన్నది.