ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్‌రావు, కిశోర్ గుండాల నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్ట్ని ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించామని, సినిమా బాగా వచ్చిందని నిర్మాతలు చెప్పారు.
ప్రేమ, సస్పెన్స్ కలయికతో ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుందని దర్శకుడు రవి లోకిరెడ్డి తెలిపారు. ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక, కాకినాడ నాని, తదితరులు ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకటరాజు.డి, సంగీతం: శ్రీమురళీ కార్తికేయ.