కల్యాణ్‌రామ్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘బింబిసార’.‘ఏ ట్రైమ్ ట్రావెట్ ఫ్రమ్ ఈవిల్ టూ గుడ్’ ఉపశీర్షిక. వశిష్ట్ దర్శకుడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘శరణు కోరితే ప్రాణభిక్ష..ఎదిరిస్తే మరణం’..‘నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడు కత్తిని దాటాల్సిందే’ అంటూ కల్యాణ్ రామ్ చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. బింబిసారుడి గెటప్‌లో కల్యాణ్‌రామ్ శక్తివంతమైన రాజుగా కనిపించాడు. ‘ఈ నెల 29న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. దీనికి ఎన్టీఆర్ అతిథిగా హాజరవుతారు’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి చిరంతన్‌భట్ సంగీతాన్నందిస్తున్నారు.