కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ సినిమాలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో హీరో కల్యాణ్‌రామ్ కనిపించబోతున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనులతో పాటు సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.