Amigos Trailer | ఏడేళ్ల తర్వాత ‘బింబిసార’తో తిరుగులేని విజయాన్ని సాధించిన కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం అదే జోరులో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడ లేని బజ్ క్రియేట్ చేశాయి. రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం..అందులో ఒకరు ఇన్నోసెంట్‌గా, మరొకరు స్టైలిష్‌గా, మూడోవాడు నెగెటీవ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా టీజర్లో కళ్యాణ్‌రామ్ మేకోవరం నందమూరి అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం మెప్పించింది. పైగా మైత్రీ నుండి వస్తున్న సినిమా కావడంతో సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే మేకర్స్ ట్రయిలర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు. టీజర్లో చూపించిన విధంగానే అనుకోకుండా ఒకే విధంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం, అందులో ఒకడు నెగెటీవ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ట్రైలర్లోనూ చూపించారు. తన లాగే ఉన్న మిగితా ఇద్దరిని అడ్డం పెట్టుకుని విలన్ పాత్ర పోషించిన మూడో వాడు తన ఇల్లీగల్ దందాలను ఎలా నడిపాడు అనే నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. మధ్యలో కళ్యాణ్‌రామ్, అశికా రంగనాథ్ లవ్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తుంది. ఎన్నో రాత్రులోస్తాయి సాంగ్ ట్రైలర్‌కే హైలేట్‌గా నిలిచింది. మూడు పాత్రలో కళ్యాణ్‌రామ్ మేకోవర్ కూడా బాగానే చేసినట్లు తెలుస్తుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్, నితిన్ ప్రసన్నలు నటించారు.