Amigos | ఆసక్తి రేకెత్తిస్తున్న కళ్యాణ్‌రామ్ అమిగోస్ టీజర్..!
ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే నటులలో నందమూరి కళ్యాణ్‌రామ్ ఒకడు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు తీస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'అమిగోస్' కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమానే.
Amigos Teaser | ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే నటులలో నందమూరి కళ్యాణ్‌రామ్ ఒకడు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు తీస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘అమిగోస్’ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమానే. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం..అందులో ఒకరు ఇన్నోసెంట్‌గా, మరొకరు స్టైలిష్‌గా, ఇంకొకరు నెగెటీవ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా టీజర్లో కనిపించారు. మనం కలవడం ఓ అద్భుతం.. విడిపోవడం అవసరం అంటూ కళ్యాణ్ రామ్ డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యాక్షన్ స్టంట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆసక్తి రేకెత్తిస్తుంది. టీజర్‌తోనే మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. కళ్యాణ్‌రామ్‌కు ఈ సినిమా కూడా బింబిసార స్థాయిలో విజయాన్నిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్ నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

