Amigos Movie | తక్కువ రన్టైమ్తో వస్తున్న కళ్యాణ్‌రామ్.. అమిగోస్‌కు ఇదేదో కలిసోచ్చేలా ఉందే..!
ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే నటులలో కళ్యాణ్‌రామ్ ఒకడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని అనుక్షణం ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్‌రామ్ ప్రయోగాశాల నుండి వస్తున్న మరో సినిమా 'అమిగోస్'.
Amigos Movie Run Time | ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే నటులలో కళ్యాణ్‌రామ్ ఒకడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని అనుక్షణం ఆలోచిస్తుంటాడు. ‘హరేరామ్’, ‘ఓమ్3డీ’, ‘118’ వంటి సినిమాలతో కంటెంట్‌ను ప్రోత్సహించే హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక కళ్యాణ్‌రామ్ ప్రయోగాశాల నుండి వస్తున్న మరో సినిమా ‘అమిగోస్’. ఏడేళ్ల తర్వాత ‘బింబిసార’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన కళ్యాణ్‌రామ్.. అమిగోస్‌తో దాన్ని కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. మొట్టమొదటి సారిగా కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. రక్త సంబంధం లేకుండా ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కలుసుకోవడం.. అసలు ఆ ముగ్గురు ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది. కలుసుకున్న తర్వాత వాళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైయ్యాయి వంటి ప్రశ్నలను టీజర్, ట్రైలర్లతోనే సంధించారు. ఆ ముగ్గురులో ఒకడు నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం. వాడి వాల్ల మరో ఇద్దరు ఇబ్బందుల్లో పడటం వంటివి సినిమాపై కాస్త ఆసక్తి రేకెత్తించే అంశాలే. ఇదివరకు ‘జై లవకుశ’లో ఇలాంటి పాత్రలు చూసేశామే అనే ఫీలింగ్ వచ్చినా అమిగోస్ కాస్త అప్డేట్ వెర్షన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంత మంచి స్టోరీలైన్‌తో వస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా ఉంటే కళ్యాణ్‌రామ్ ఖాతాలో మరో హిట్టు పడ్డట్లే.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసి మంచి మార్కులు కూడా ఇచ్చిందని సమాచారం. అయితే ఈ సినిమా రన్‌టైమ్ కూడా అమిగోస్‌కు ప్లస్ అయ్యే అంశంలానే కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రన్‌టైమ్ ఎంత తక్కువుంటే అంత బెటర్. ప్రస్తుతం అదే సూత్రాన్ని పాటించారు ఈ సినిమా మేకర్స్. ఇక ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 2గంటల 19నిమిషాలు మాత్రమే. ఇంత తక్కువ రన్‌టైమ్‌లో అవసరమైన సీన్లను మాత్రమే కాస్త ఎంగేజింగ్‌గా చూపిస్తే అమిగోస్ పాసైనట్టే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

