Amigos Movie | కళ్యాణ్‌రామ్ అమిగోస్ ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'అమిగోస్'. 'బింబిసార' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కళ్యాణ్‌రామ్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుండటంతో అమిగోస్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Amigos Movie First Single | కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘అమిగోస్’. ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కళ్యాణ్‌రామ్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుండటంతో అమిగోస్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడుగా ఇటీవలే రిలీజైన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కళ్యాణ్‌రామ్ మూడు లుక్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోసారి కళ్యాణ్‌రామ్ ప్రయోగాత్మక సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘యెక యెక’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఒకరితో ఒకరికి సంబంధంలేకుండా ఓకేలా ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పాటలో తెలియజేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అశికా రంగనాథ్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇన్నోసెంట్ సాఫ్ట్‌వేర్‌గా, స్టైలిష్ బిజినెస్ మేన్‌గా, నెగెటీవ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా ఇలా మూడు విభిన్న స్వభావాలు కలిగిన పాత్రల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

