నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. రాజేందర్ రెడ్డి దర్శకుడు.నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ పదం. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించచోతున్నారు. ైస్టెలిష్లుక్లో కనిపించే సిద్దార్థ్‌గా, మంజునాథ్ అనే అమాయకంగా కనిపించే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కళ్యాణ్‌రామ్.
మూడో లుక్ పాత్రను అజాత వ్యక్తిగా వుంచుతున్నాం. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది’ అన్నారు. ఆషికా రంగనాథ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్.