Devil | కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ కథాంశమిది. సంయుక్తా మీనన్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఎవరికీ అంతు పట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. భారీ యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. కల్యాణ్‌రామ్ భిన్న గెటప్స్‌లో కనిపిస్తారు. ఆయన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.