Bimbisara Glimps | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఫాంటసీ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను మొదలు పెట్టింది.
బింబిసార విడుదల తేదీను ప్రకటిస్తూ మేకర్స్ ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారా’ అంటూ కళ్యాణ్‌రామ్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్‌లోని విజువల్స్, కళ్యాణ్‌రామ్ లుక్స్ ట్రైలర్‌పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.