Kalyan Dev: ఈ ఫొటో తర్వాత అయిన రూమర్స్కి చెక్ పడతాయో లేదో మరి..!

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ, యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారనే విషయం తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే పాప కూడా ఉంది. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు తోడుగా దీపావళి సెలబ్రేషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదు కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ తో మెగా హీరోలంతా కలిసి ఫోజులిచ్చిన ఫోటోల్లో కూడా కళ్యాణ్ దేవ్ లేకపోవడంతో సోషల్ మీడియాలో మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి.
ఇక శ్రీజ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ తో కలిసి ఉన్న ఫోటోలు ఈ మధ్య ఎక్కువగా పోస్ట్ చేయలేదు. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులతో వీళ్ళను కూడా కలిపేస్తూ.. అతి త్వరలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో నెటిజన్ల అనుమానాలకు చెక్ పెట్టారు. శ్రీజ బర్త్ డే స్పెషల్ గా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కళ్యాణ్ దేవ్ ఓ పోస్ట్ పెట్టారు. హ్యాపీ హ్యాపీ బర్త్ డే స్వీటూ.. అని క్యాప్షన్ తో పాటు రెడ్ హార్ట్ ఎమోజీని యాడ్ చేసి, శ్రీజతో కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ కి శ్రీజ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు. ఈ ఫోటోతో మెగా ఫ్యాన్స్ కు ఊరట కలిగింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ హీరోగా సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమా షూటింగ్స్ పూర్తి చేశారు. నెక్ట్స్ శ్రీధర్ సీపాన డైరెక్షన్ లో కళ్యాణ్ దేవ్ ఓ సినిమా వర్క్ చేస్తున్నారు. అలాగే జీఎ 2 పిక్చర్స్ సమర్పణలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలతో కళ్యాణ్ దేవ్ బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

