Kalki 2898 AD | ఏవరా బుజ్జి?.. కల్కి వరల్డ్ నుంచి రివీల్ కానున్న మరో సూపర్‌స్టార్
‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి చెందిన ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలుపెట్టినప్పట్నుంచీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ద్రోణసుతుడైన అశ్వద్ధామగా అమితాబ్‌ని చూసినప్పట్నుంచీ, ఈ సినిమా విడుదల తేదీ అయిన ‘జూన్ 27’ కోసం ప్రేక్షకుల రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
Kalki 2898 AD | ‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి చెందిన ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలుపెట్టినప్పట్నుంచీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ద్రోణసుతుడైన అశ్వద్ధామగా అమితాబ్‌ని చూసినప్పట్నుంచీ, ఈ సినిమా విడుదల తేదీ అయిన ‘జూన్ 27’ కోసం ప్రేక్షకుల రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ టీజర్ విశేష ఆదరణ పొందింది. ఇదిలావుంటే.. ‘కల్కి వరల్డ్’ నుంచి త్వరలో మరో సూపర్‌స్టార్ రివీల్ కానున్నారు.
ఇందులో ప్రభాస్ ‘భైరవ’గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ భైరవ ప్రాణమిత్రుడైన బుజ్జి ఈ నెల 22న ప్రేక్షకులకు కనిపించనున్నాడు. అసలు ఎవరా బుజ్జి?.. ‘కల్కి వరల్డ్’లో ఈ బుజ్జి స్థానం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియోను బట్టి ‘బుజ్జి’ అంటే పలు ప్రత్యేకతలతో కూడుకున్న భైరవ ‘కారు’ అని తెలుస్తున్నది. ఈ నెల 22న బుజ్జిని పూర్తిస్థాయిలో మేకర్స్ రివీల్చేస్తారు.
అలాగే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఓ భారీ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి, ఓ పాటను కూడా అక్కడ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. ‘కల్కి 2898ఏడీ’గా ప్రభాస్ టైటిల్‌రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొనే, దిషా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహానటి’ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

