Prabhas | ప్రభాస్ ‘బుజ్జి’ వచ్చేసింది.. ఇంతకీ ఎవరో తెలుసా?
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత శుక్రవారం ఇన్‌స్టా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. డార్లింగ్స్ త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ కొత్త పర్సన్ రాబోతోన్నారు.. గుడ్ న్యూస్ వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ వేశాడు. అయితే ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు అందరూ ప్రభాస్ పెళ్లి అనౌన్స్మెంట్ కావోచ్చని తెగ సంబరాలు చేసుకున్నారు.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత శుక్రవారం ఇన్‌స్టా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. డార్లింగ్స్ త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ కొత్త పర్సన్ రాబోతోన్నారు.. గుడ్ న్యూస్ వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ వేశాడు. అయితే ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు అందరూ ప్రభాస్ పెళ్లి అనౌన్స్మెంట్ కావోచ్చని తెగ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఈ పోస్ట్ సినిమా అప్డేట్ అవ్వోచ్చని కామెంట్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక చెప్పినట్లుగానే తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేశాడు ప్రభాస్.
తాజాగా బుజ్జికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో బుజ్జి పాత్ర చిట్టి రోబో అని తెలుస్తుంది. బుజ్జి పేరుతో అందరూ దాన్ని పిలుస్తున్నారు. ఎవరా బుజ్జి అంటూ అంటూ వచ్చిన ఈ చిట్టి రోబోకు హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. బుజ్జి మాటలు, బుజ్జి చేసే అల్లరి ఎంటర్టైనింగ్గా అనిపించాయి. ఇక గ్లింప్స్ చివరిలో ‘నా లైఫ్ ఎంటి? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా’ అంటూ చెబుతుండగా.. ప్రభాస్ వచ్చి ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ఒక స్పెషల్ కారును రివీల్ చేయబోయాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వెయిట్ చేయాల్సిందేనని చిత్రయూనిట్ తెలిపారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపిక, దిశా పటానీ హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

