ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 11వందలకోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. దాంతో ‘కల్కి2’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘కల్కి 2’ రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్నది. అయితే.. ఎక్కువ భాగం ప్రభాస్ లేని సన్నివేశాలనే దర్శకుడు నాగ్అశ్విన్ చిత్రీకరించారు. ఇక ఆగస్ట్ నుంచి ప్రభాస్ సన్నివేశాలను షూట్ చేసేందుకు నాగ్అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట.
ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ మూడు నెలల పాటు నిరవధికంగా జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ‘ఫౌజీ’ షూటింగ్‌ని దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్.. ఆగస్టు నుంచి ‘కల్కి 2’కు డేట్స్ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసి, 2027 సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.