Rangabali | టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న సినిమాల్లో ఒకటి రంగబలి (Rangabali). ఈ సినిమాతో పవన్ బసంశెట్టి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ సాంగ్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రెండో సాంగ్ కల కంటూ ఉంటే (Kala Kantu Unte) అప్డేట్ కూడా అందించారు మేకర్స్. ఈ పాట ప్రోమోను లాంఛ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్ 19న సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు.
హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్‌తో సాంగ్ ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రంగబలి చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ జులై 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ ప్రాజెక్ట్‌లో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగశౌర్య మరోవైపు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉన్నాయి.
కుర్రాళ్లంటే ఈ వయస్సులో ఇలాగే ఉంటార్రా.. నువ్వేం కంగారు పడకు.. అంటూ హీరో మాస్ క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేసే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫన్, సీరియస్ అంశాల నేపథ్యంలో రంగబలి ఉండబోతుందని టీజర్‌తో తెలియజేశాడు దర్శకుడు.
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
రంగబలి టీజర్..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..